: ఏనుగుల దాడిలో కుప్పం పంటలకు నష్టం


చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రైతులకు ఏనుగుల బెడద వీడటం లేదు. నిత్యం ఏనుగుల దాడులతో భీతిల్లుతున్న రైతులు, సోమవారం నాటి ఏనుగుల దాడుల్లో భారీ నష్టాలనే మూటగట్టుకోవాల్సి వచ్చింది. కుప్పం మండలం ఓబనపల్లి పరిధిలోని పొలాలపై సోమవారం ఏనుగులు దాడి చేశాయి. పొలాలపై సంచరించిన ఏనుగుల మందతో టమోటా పంట నాశనం కావడంతో పాటు సాగు నీటి పైపులు ధ్వంసమయ్యాయి. ఏనుగుల దాడిలో తమకు తీరని నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News