: కేసీఆర్ పాలన హిట్లర్, తుగ్లక్ లను మరిపిస్తోంది: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పాలన ద్వారా తుగ్లక్, హిట్లర్ లను తలపిస్తున్నారని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష ఉపనేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పాలన చేస్తూ వారిద్దరిని కేసీఆర్ మరిపిస్తున్నారన్నారు. దేశప్రధాని నరేంద్రమోడీని ఫాసిస్ట్ అనడానికి కేసీఆర్ కు అసలు నోరెలా వచ్చిందని ఆయన విరుచుకుపడ్డారు. కేసీఆర్ మాటల వెనుక మజ్లిస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారని ఆరోపించారు. సకలజన సర్వే వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తగ్గించేందుకే ఈ సర్వే అని ఆయన విమర్శించారు.