: కామన్వెల్త్ విజేతకు రూ.25 లక్షల నగదు బహుమతి
అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ ప్రదర్శించి పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నగదు బహుమతులు ప్రకటించారు. ప్రపంచ కబడ్డీ పోటీల్లో స్వర్ణం సాధించిన నాగలక్ష్మికి రూ.25 లక్షల బహుమతిని బాబు అందించారు. అలాగే, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతక విజేత మత్స సంతోషికి రూ.25 లక్షల నగదు బహుమతిని ముఖ్యమంత్రి అందించారు.