: సత్యం కేసు సెప్టెంబరు 15కి వాయిదా
సత్యం కేసులో తీర్పును రిజర్వులో ఉంచుతూ జడ్జి కేసును సెప్టెంబరు 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసు విచారణ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు తదితరులు ఇవాళ (సోమవారం) ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రంపై కూడా ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కేసులో ఉన్న 10 మంది నిందితులతో పాటు రామలింగరాజు కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు హాజరయ్యారు.