: నిథమ్ ఏర్పాటు తెలంగాణలోనే
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ (నిథమ్) తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటవుతోంది. నిథమ్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. విభజన చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం నిథమ్ తెలంగాణకే చెందుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. పరస్పర అవగాహనతో ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందిస్తుందని, నిథమ్ ఛైర్మన్ గా పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిని నియమించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు.