: ఓ చెత్త రికార్డుకు మూడు ఓటముల దూరంలో ధోనీ


ఇలాంటి రికార్డులను ఎవరూ కోరుకోరేమో..! ఇప్పుడు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ముందర అలాంటి అవాంఛనీయ రికార్డు ఒకటి నిలిచింది. అదేమిటంటే... మరో మూడు మ్యాచ్ లలో ఓటమిపాలైతే అత్యధిక టెస్టులు ఓడిన కెప్టెన్ల జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రియాన్ లారా సరసన ధోనీ కూడా చేరతాడు. కివీస్ మాజీ సారథి ఫ్లెమింగ్, విండీస్ మాజీ కెప్టెన్ లారా... ఇద్దరూ కూడా చెరో 16 ఓటములతో ఈ జాబితాలో టాప్ లో ఆసీనులై ఉన్నారు. ప్రస్తుతం ధోనీ ఖాతాలో 13 ఓటములున్నాయి. కాగా, భారత మాజీ కెప్టెన్లు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, మహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ పదేసి ఓటములు ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలే న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా తన సీనియర్ల రికార్డును ధోనీ బ్రేక్ చేశాడు.

  • Loading...

More Telugu News