: 'ప్రత్యేక మాస్కు'తో చివరి టెస్టు బరిలో దిగనున్న బ్రాడ్!


నాలుగోటెస్టులో తీవ్రంగా గాయపడిన ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ ఐదో టెస్టులో ప్రత్యేక మాస్కు ధరించి బరిలో దిగనున్నాడు. టీమిండియా స్పీడ్ స్టర్ వరుణ్ ఆరోన్ విసిరిన బంతి హెల్మెట్ గ్రిల్ లోంచి దూసుకెళ్ళి బ్రాడ్ ముక్కును బలంగా తాకింది. దీంతో, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ ఇంగ్లిష్ పేసర్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం సిరీస్ చివరి టెస్టులో ఆడొచ్చని వైద్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, ముందు జాగ్రత్తగా ముఖానికి మాస్కు ధరించాలని వారు సూచించారు. కాగా, ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో బ్రాడ్ ఆరు వికెట్లతో భారత్ వెన్నువిరిచి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News