: గంగానదిలో వరద ఉద్ధృతి
ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గంగానదిలో వరద ఉద్ధృతి పెరిగింది. వరదనీరు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంగానది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి వరదనీరు చేరింది. నది ఒడ్డున ఉన్న ఆలయాలు నీటమునిగాయి. కోల్ కతాలో గంగానదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో నదిలో స్నానాలు చేస్తున్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. అలహాబాదులోని ఆలయాల్లోకి వరదనీరు వచ్చి చేరింది.