: సికింద్రాబాదు ఆల్వాల్ లో కలకలం
సికింద్రాబాదు ఆల్వాల్ లో కలకలం రేగింది. ఓ మాయలేడి ముగ్గురు చిన్నారులను ఎత్తుకెళ్లడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ముగ్గురు బాలికలను గుర్తు తెలియని మహిళ అపహరించింది. స్కూలు విడిచిన తర్వాత చిన్నారులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వారి గురించి బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేశారు. ఎక్కడా వారి జాడ లేకపోవడంతో కిడ్నాప్ కు గురైనట్లు గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల నుంచి ఇద్దరు బాలికలు తప్పించుకోగా, మరో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.