: సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ పై ఫిర్యాదు


పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ పై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. అజ్మల్ బౌలింగ్ తీరు అనుమానాస్పదంగా ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా అజ్మల్ బౌలింగ్ తీరును నిశితంగా గమనించిన ఫీల్డ్ అంపైర్లు ఈ విషయాన్ని పాక్ జట్టు మేనేజ్ మెంటుకు కూడా తెలిపారు.ఈ రైట్ హ్యాండ్ ఆఫ్ స్పిన్నర్ విసిరే చాలా డెలివరీలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, మూడు వారాల్లోగా పాక్ స్పిన్నర్ బౌలింగ్ ను పరీక్షిస్తామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈలోపు అజ్మల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడవచ్చని పేర్కొంది.

  • Loading...

More Telugu News