: గవర్నరుకు అధికారాలు అప్పగిస్తున్నట్లు అప్పుడే చెప్పారు: రేవంత్ రెడ్డి


విభజన బిల్లు ఆమోదించినప్పుడు కేసీఆర్, కేకే నోరు ఎందుకు మెదపలేదని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శాసనసభకు వచ్చిన బిల్లులోనే గవర్నరుకు అధికారాలు అప్పగించిన అంశం కూడా ఉందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను పోలీసులతో తన్నిస్తున్నారని ఆయన అన్నారు. విద్యుత్ అడిగిన రైతుల కాళ్లు విరగ్గొడుతున్నారని, ఉద్యోగాలను అడుగుతున్న విద్యార్థులను పోలీసులతో కొట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ వెనుక కుట్ర ఉందని, కేసీఆర్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. బోధనా రుసుముల విధివిధానాలను కేసీఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల బలిదానం వల్లే టీఆర్ఎస్ కు అధికారం వచ్చిందన్న రేవంత్ రెడ్డి... ఉద్యోగాల కోసం దీక్షలు చేస్తున్న విద్యార్థులతో చర్చలు ఎందుకు జరపడం లేదని నిలదీశారు. నచ్చిన కాంట్రాక్టరుకు వందల కోట్ల రూపాయలు ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. కమిషన్ల కోసమే ఇతరులకు బకాయిలు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు. అవినీతికి సెంటిమెంట్ ముసుగు వేశారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News