: కేబినెట్ భేటీలో మంత్రులకు క్లాస్ తీసుకున్న చంద్రబాబు
హైదరాబాదులో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో మంత్రులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. రాజధానిపై విబిన్న ప్రకటనలు చేయొద్దని ఆయన చెప్పారు. ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని ఆయన మంత్రులకు హితవు పలికారు. రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర విభజన బిల్లుపై మరింత స్పష్టత కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 8, 9, 10 షెడ్యూల్స్ పై సమగ్ర చర్చ జరపాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.