: ప్రకాశం జిల్లా జెడ్పీ ఛైర్మన్ పై అనర్హత వేటు
ప్రకాశం జిల్లా జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుపై అనర్హత వేటు పడింది. హరిబాబు జెడ్పీటీసీ సభ్యత్వాన్ని కలెక్టర్ విజయ్ కుమార్ రద్దు చేశారు. టీడీపీ జారీ చేసిన విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు అనర్హత వేటు వేసినట్లు తెలిసింది. కాగా, ఈదర హరిబాబు జిల్లా పరిషత్ ఎన్నికల్లో చివరి నిమిషంలో ఛైర్మన్ బరిలో నిలిచి, జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.