: గ్రేటర్ ఎలక్షన్లలో బీజేపీ విజయానికి అమిత్ షా 'పదునైన' వ్యూహాలు


కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో... 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' క్రెడిట్ ను దక్కించుకున్న అమిత్ షా ఈ నెల 20న హైదరాబాద్ కు రానున్నారు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో వ్యూహరచన చేయడానికే అమిత్ షా ఈ పర్యటన చేస్తున్నారు. గ్రేటర్ ఎలక్షన్లలో అమలు చేయాల్సిన వ్యూహాలపై పార్టీ కార్యకర్తలు, పదాధికారులతో ఆయన చర్చిస్తారు. జీహెచ్ఎంసి ఎలక్షన్లలో బీజేపీ-టీడీపీ కూటమి... టీఆర్ఎస్-మజ్లిస్ కూటమి హోరాహోరిగా తలపడనున్నాయి. ఈ పోరులో బీజేపీ-టీడీపీ కూటమి ఘనవిజయానికి అమిత్ షా ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ లో టీఆర్ఎస్ బలహీనంగా ఉందని ఆయన అనుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో మెజార్టీ అసెంబ్లీ సీట్లను టీడీపీ-బీజేపీ కూటమి గెలుచుకోవడం కూడా తమకు ఈ ఎన్నికల్లో కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించిన తీరు... హైదరాబాద్ లోని సీమాంధ్ర ప్రాంత వాసుల పట్ల వారు వ్యవహరించిన విధానంతో.... తమకు నగరంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో కచ్చితంగా విజయం దక్కుతుందని బీజేపీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో గ్రేటర్ ఎలక్షన్లలో టీఆర్ఎస్-మజ్లిస్ కూటమికి అడ్డుకట్ట వేయడానికి ఎలా ప్రచారం చేయాలి... ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనే విషయంపై పార్టీకి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

  • Loading...

More Telugu News