: ఈ నెల 19న జరిగే తెలంగాణ సర్వేలో పాల్గొనం: ఏపీ ఉద్యోగ సంఘాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సర్వే అధికారులుగా ఆంధ్ర ఉద్యోగులు పాల్గొనరని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబితేనే సర్వేలో పాల్గొంటామని తెలిపారు. తమపై నమ్మకం లేనప్పుడు సర్వేలో పాల్గొనాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనాలంటూ ఇరవై రెండు మంది ఏపీ ఉద్యోగులకు జీహెచ్ఎంసీ కమిషనర్ నోటీసులు పంపిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు పైవిధంగా స్పందించారు.