: విభజన చట్టం ప్రకారమే మేం నడుచుకుంటాం: లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్
విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ లో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు దఖలు చేయడం జరిగిందని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. హైదరాబాద్ లో శాంతిభద్రతలపై గవర్నర్ తుదినిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. గవర్నర్ కు ఈ విషయంలో సలహాలు అందించడానికి... ఇద్దరు అధికారులను కేంద్రం నియమిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు రూపకల్పన చేసింది యూపీఏ ప్రభుత్వమేనని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. హోంమంత్రి వ్యాఖ్యల పట్ల తెరాస సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెరాస ఎంపీలు తమ నిరసన వ్యక్తం చేస్తుండగానే... స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.