: భారత్-పాక్ సరిహద్దుల్లో సురేశ్ రైనా హల్ చల్
భారత క్రికెటర్ సురేశ్ రైనా నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక పోస్టును సందర్శించాడు. అంతేగాకుండా, సైనికులతో కలిసి భోజనం కూడా చేశాడు. ఈ సందర్భంగా వారి పాకశాస్త్ర నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. రైనా వారితో ముచ్చటిస్తూ, తన జీవితంలోని కొన్ని సంఘటనలను పంచుకోవడం విశేషం. రైనా కాశ్మీర్ రాకపై రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక పోస్టును రైనా సందర్శించాడని, ఆ పర్యటన ద్వారా భారత సైనికుల స్థైర్యం ఇనుమడిస్తుందని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ ఎన్ఎన్ జోషి పేర్కొన్నారు. సరిహద్దుల్లో భారత్ సైనికుల అప్రమత్తతను రైనా కొనియాడాడని తెలిపారు. కాగా, సురేశ్ రైనా కాశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందినవాడు. వీరిది కాశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా. అయితే, రైనా కుటుంబం యూపీకి వలస వెళ్ళింది. రైనా స్వరాష్ట్రం జమ్మూకాశ్మీర్ కు రంజీల్లో ప్రాతినిధ్యం వహించలేదు.