: లోక్ సభలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీఆర్ఎస్ ఎంపీలు


సోమవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాగానే... టీఆర్ఎస్ ఎంపీలు ఎన్డీఏ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఓ వైపు లోక్ సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతుండగానే... టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి జై తెలంగాణ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో శాంతిభద్రతల అధికారాలను గవర్నర్ కు కట్టబెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ సభ్యులు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నారు. తెరాస సభ్యుల నిరసనల మధ్య లోక్ సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. జీరో అవర్ లో టీఆర్ఎస్ సభ్యులకు ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించినప్పటికీ... టీఆర్ఎస్ సభ్యులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు.

  • Loading...

More Telugu News