: నటుడు బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను హైదరాబాదులోని ఆయన నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగురోజుల కిందట హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డుపై సినిమా షూటింగు చేస్తుండగా బైక్ రేసింగ్ సన్నివేశం సమయంలో బాలయ్య కాలికి గాయమైంది. ఆ వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.