: వేధించిన మగాడిని వంగోబెట్టి మరీ తన్నింది!
ఈ వీడియో చూడండి. ఇలా చేస్తేనే మగాళ్లకు బుద్దొస్తుందేమో. నానాటికీ పెరిగిపోతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు బెంగళూరుకు చెందిన ఈ మహిళను బాగా కలచివేశాయేమో. అందుకే ఒక్కసారిగా ఎక్కడ లేని కోపం వచ్చేసింది. మీకు ఎలా బుద్ధి చెప్పాల్రా బాబూ అంటూ, తనను వేధించిన ఓ మృగాడిని పరుగులు పెట్టించి మరీ బెంబేలెత్తించింది. అంతేనా, రోడ్డపై వంగోబెట్టి మరీ తన్నింది. బెంగళూరులో జరిగినట్టుగా ఓ టీవీ చానెల్ ప్రసారం చేసిన ఈ వీడియో ప్రస్తుతం ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. పార్కులో తనను వేధించిన యువకుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న సదరు యువతి, అతడిపై దాడి చేస్తున్న దృశ్యాలను రికార్డ్ అయ్యేలా ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత అతడిపై తిరగబడింది. యువతి ఏర్పాటు చేసిన కెమెరా చూసిన మగాడు పరుగులు పెట్టాడు. అయినా ఆ మగాడిని విడిచిపెట్టని యువతి, రోడ్డుపైనే వంగోబెట్టింది. ఆమె ప్రతాపం చూసిన అతడు నడిరోడ్డుపై వంగోక తప్పలేదు. సగం వంగుతావేంటన్న యువతి ఘీంకారంతో తలవంచక తప్పని అతడు రోడ్డుపై పూర్తిగా వంగాడు. అంతే, బూటు కాలితో ఒక్క తన్ను తన్నిన ఆ యువతి, 'మహిళలను వేధిస్తే, ఇదే గతి' అంటూ ఆ మగాడిని హెచ్చరించడంతో... బతుకు జీవుడా అంటూ అతడు పరుగులు పెట్టాడు. ఆ తర్వాత సదరు వీడియో క్లిప్పింగ్ ను ఫేస్ బుక్ లో పెట్టిన ఆ యువతి, ‘మీకూ ఇలాంటి వేధింపులు జరిగితే, ఈ తరహాలోనే బుద్ధి చెప్పండి’ అంటూ మహిళలకు సలహా ఇచ్చారు.