: గవర్నర్ కు అధికారాలను నిరసిస్తూ నేడు టీఆర్ఎస్ ఎంపీల తీర్మానం
హైదరాబాదుపై గవర్నర్ కు విశేషాధికారాలను కట్టబెట్టడాన్ని నిరసిస్తూ నేడు టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కు వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఈ ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు సభల్లో నిరసన తెలియజేస్తూనే ఉండాలని... పార్టీ ఎంపీలకు ఇప్పటికే కేసీఆర్ సూచించారు. అవసరమైతే వెల్ లోకి వెళ్లి నిరసన తెలపాలనే భావనలో టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు.