: అధికారులు తమ ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో ఉంచాలి: కేంద్రం
వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు తమ ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో ఉంచాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. వారి స్థిర, చరాస్థి వివరాలను తప్పనిసరిగా ఆయా వెబ్ సైట్లలో పొందుపరచాలని సూచించింది. పాలనలో పారదర్శకత కోసం శ్రమిస్తున్న మోడీ సర్కారు ఇటీవలే ఇదే విషయమై రక్షణ శాఖకు నోటీసు పంపింది.