: ఏదో జరిగిపోతోందని బాబు ప్రచారం చేయడంవల్లే గవర్నర్ కు అధికారాలు: వీహెచ్
గవర్నర్ కు అధికారాల అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఏదో జరిగిపోతోందని చంద్రబాబు చేసిన ప్రచారం వల్లే గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టాలన్న నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై గవర్నర్ అజమాయిషీ సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు.