: గవర్నర్ అధికారాలపై రేపు పార్లమెంటులో వాయిదా తీర్మానం: టీఆర్ఎస్
సీఎం కె.చంద్రశేఖరరావుతో టీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, జితేందర్ రెడ్డిల సమావేశం ముగిసింది. అనంతరం జితేందర్ మాట్లాడుతూ, గవర్నర్ అధికారాల అంశంపై రేపు పార్లమెంటులో వాయిదా తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. గవర్నర్ అధికారాలను తప్పక అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై అన్ని పార్టీల మద్దతు కూడగడతామని పేర్కొన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్... నవీన్ పట్నాయక్, జయలలిత, మమతా బెనర్జీ వంటి నేతలతో మాట్లాడుతున్నారని జితేందర్ రెడ్డి వెల్లడించారు.