: వాజ్ పేయికి భారతరత్న..? ఆగస్టు 15న ప్రకటించే అవకాశం!


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి 'భారతరత్న' పురస్కారం అందించేందుకు కేంద్రం సిద్ధమైనట్టు సమాచారం. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తారని తెలుస్తోంది. కాగా, వాజ్ పేయితో పాటు స్వాతంత్ర్య సమరవీరులు సుభాష్ చంద్రబోస్, పండిత మదన్ మోహన్ మాలవ్య... లెజండరీ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంలకు ఈ అత్యున్నత పురస్కారం అందించాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఐదు పతకాలు తయారుచేయాలని మింట్ కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేయడం చూస్తుంటే... ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం 'భారతరత్న స్పెషల్' గా చరిత్రలో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News