: కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోంది: ఎర్రబెల్లి


తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక్కరోజులోనే తెలంగాణ వ్యాప్తంగా కుటుంబాల సర్వే నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సర్వేను కనీసం వారం రోజులపాటు నిర్వహించాలని సూచించారు. సర్వే జరపాలనుకుంటున్న రోజు (ఈ నెల 19)న వేలాది శుభకార్యాలు ఉన్నాయని... సర్వే కోసం పెళ్లిళ్లను సైతం వాయిదా వేసుకునే పరిస్థితి తీసుకురావాలనుకోవడం అవివేకం అవుతుందని అన్నారు. దీనికి తోడు, సర్వే రోజున ఆటోలు, బస్సులు కూడా బంద్ చేస్తామని చెప్పడం మంచిది కాదని తెలిపారు.

  • Loading...

More Telugu News