: కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన సినీ నటుడు సురేష్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినీనటుడు, బీజేపీ నేత సురేష్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ శాంతిభద్రతల పర్యవేక్షణను గవర్నర్ చేతిలో పెట్టడమే మంచిదని... దీనిపై కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో అభద్రతాభావంతో ఉండే వారికి ఈ నిర్ణయం ఊరటనిస్తుందని చెప్పారు. దీనిపై రాజకీయాలు చేయడం కేసీఆర్ కు తగదని మండిపడ్డారు. మొదట్లో రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని... ఇప్పుడు 1956కు ముందు అంటూ స్థానికత పేరుతో మరో విభజనకు సిద్ధమయ్యారని అన్నారు.