: ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటాం: ప్రధాని మోడీ


ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజలకు ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. ప్రజలంతా బీజేపీకి మద్దతిస్తున్నారని, వారంతా తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. సవాళ్ల స్వీకరణ... వాటిని అధిగమించే పక్కా ప్రణాళికను రచిస్తామని చెప్పారు. అరవై రోజుల పాలన తర్వాత తనలో విశ్వాసం ద్విగుణీకృతం అయిందని మోడీ తెలిపారు. గుజరాత్ లో తప్ప మోడీ గురించి ఎవరికి తెలుసునని రాజకీయ విశ్లేషకులు భావించారని... కానీ, 60 రోజుల తర్వాత ఢిల్లీ ప్రజలకు తానెవరో తెలిసిందన్నారు. ఇప్పటివరకు వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఓ పద్ధతిని నిర్దేశించుకోవడానికే సరిపోయిందని వివరించారు. అయితే, అరవైఏళ్ల పాటు ఏమీ చేయని కాంగ్రెస్ ఈ 60 రోజుల్లో ఏం చేశారని తమని ప్రశ్నించడం వింతగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News