: కేసీఆర్ తో భేటీ అయిన మహీంద్రా కంపెనీ ప్రతినిధులు
మహీంద్రా సంస్థ ప్రతినిధులు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణ, పెట్టుబడుల విషయంపై చర్చించారు. ఇప్పటికే మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా కేసీఆర్ తో భేటీ అయి పలు విషయాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా, మహీంద్ర సంస్థకు అన్నిరకాలుగా సహకరిస్తామని ఆనంద్ కు కేసీఆర్ హామీ ఇచ్చారు.