: సామంత రాజులకు ఇచ్చినట్టు జిల్లాలను కుటుంబసభ్యులకు ఇచ్చారు: జూపూడి


తన రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించానని జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, వైకాపాలో నేతల మధ్య సఖ్యత లేదని అన్నారు. ఇప్పటికీ కీలక నేతలైన బాలినేని, వైవీ మాట్లాడుకోరని వెల్లడించారు. వైయస్సార్ పార్టీ రాజరిక పాలనను తలపిస్తోందని... సామంత రాజులకు అప్పగించినట్టు కుటుంబసభ్యులకు జిల్లాలను అప్పగించారని ఎద్దేవా చేశారు. జగన్ కోసం, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానని... అయినా తనను దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News