: లైఫ్ సపోర్ట్ పైనే జశ్వంత్ సింగ్ కొనసాగుతున్నారు: రక్షణ మంత్రిత్వ శాఖ
తలకు తీవ్ర గాయం కారణంగా బీజేపీ మాజీ నేత జశ్వంత్ సింగ్ ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫ్రల్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన కోమాలో లైఫ్ సపోర్ట్ (జీవనాధార వ్యవస్థ)పైనే కొనసాగుతున్నారని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిరంతరం ఆయనను ఆసుపత్రిలో న్యూరోసర్జన్ల బృందం, అత్యవసర రక్షణ నిపుణులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించింది.