: వైకాపాలో కొనసాగలేను... రాజీనామా చేస్తున్నా: జూపూడి


వైకాపాలో వైయస్ బంధువులకు తప్ప మరో నేతకు విలువ లేదని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మనసు చంపుకుని ఇంతకాలం కొనసాగానని, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేశానని చెప్పారు. ఇకపై వైకాపాలో కొనసాగలేనని... పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల మధ్య అభద్రతా భావం నెలకొందని జూపూడి తెలిపారు. ఏ ఇద్దరు నేతలూ మాట్లాడుకునే పరిస్థితి పార్టీలో లేదని చెప్పారు. నేతలను గౌరవించే సంప్రదాయం వైకాపాలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభద్రతా భావం కలిగిన నేతలతో కూడిన పార్టీ ఎంతో కాలం మనలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News