: రాజధానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించాం: మంత్రి నారాయణ


హైదరాబాదు సచివాలయంలో రాజధాని సలహా కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సమావేశ వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో శివరామకృష్ణన్ కమిటీ పర్యటిస్తుందని ఆయన చెప్పారు. ఈ నెలాఖరులోగా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక వస్తుందని ఆయన తెలిపారు. రాజధానికి సంబంధించిన అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించామని నారాయణ చెప్పారు. ప్రభుత్వ భవనాలు, కార్పొరేట్ సంస్థలు తదితర విషయాలపై చర్చించామని ఆయన అన్నారు. అంశాల వారీగా సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని, సబ్ కమిటీల ఏర్పాటుపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ చెప్పారు.

  • Loading...

More Telugu News