: ఏపీలో 120 మండలాల్లో రుణాల రీషెడ్యూల్ కు ఆర్ బీఐ ఓకే


ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రుణాల రీషెడ్యూలుకు ఎట్టకేలకు రిజర్వుబ్యాంక్ అంగీకరించింది. అయితే, రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కృష్ణాజిల్లాల పరిధిలోని 120 మండలాల్లో మాత్రమే రుణాల రీషెడ్యూల్ కి అనుమతించింది. ఈ మేరకు ఆర్ బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాలీ పంత్ నిన్న (శుక్రవారం) ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో రుణాల రీషెడ్యూల్ కు విధించిన పరిమితులను వివరంగా తెలిపారు. ఏపీలో మొత్తం 653 మండలాలు ఉన్నాయి. వీటిలో కరవు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 575 మండలాల్లో రైతుల తీవ్రంగా నష్టపోయారు. దీంతో, ఈ మండలాల్లో రుణాలను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర సర్కార్ ఆర్ బీఐని అంతకుముందు కోరింది. అయితే, మిగిలిన మండలాల్లో నష్ట శాతం తక్కువగానే ఉందన్న ఆర్ బీఐ... కేవలం నాలుగు జిల్లాలోని 120 మండలాలకు మాత్రమే రీషెడ్యూల్ కు అనుమతించింది. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఆర్ బీఐ నిబంధనలకు అనుగుణంగా పరిస్థితులున్నాయో అక్కడ మాత్రమే వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్ వర్తిస్తుందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News