: టీడీపీతో పొత్తు లేదు...అధికారాలు గవర్నర్ వే: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీతో పొత్తు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో హైదరాబాదులో పర్యటిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయంగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా ఎదుగుతుందని ఆయన వెల్లడించారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్ వే సర్వాధికారాలని ఆయన స్పష్టం చేశారు. అందుకే హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా అంగీకరించామని ఆయన అన్నారు.