: ఫైర్ వర్క్స్ లో పేలుడు... ఒకరి మృతి, 8 మందికి గాయాలు
ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఒకరు సజీవ దహనమయ్యారు. మరో 8 మంది గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు శివారు ధర్మాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోట్ల అరుణకుమారి (30) ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు నష్టపరిహారం అందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. క్షతగాత్రులను కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.