: తెలుగు సినిమా చేస్తానంటున్న శ్రీశాంత్?


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధానికి గురయిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ క్రమంలో తెలుగులో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇందుకోసం సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్లు శ్రీశాంత్ వెల్లడించాడు. ఈ విషయంలో తెలుగు పరిశ్రమకు చెందిన దర్శకుడితో చర్చిస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానన్నాడు. తన వ్యక్తిగత పనిపై నిన్న (శుక్రవారం) హైదరాబాదు వచ్చిన శ్రీశాంత్ ను మాదాపూర్ లోని నొవాటెల్ హోటల్ లో మీడియా పలకరించగా పై విషయాలను వెల్లడించాడు.

  • Loading...

More Telugu News