: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు... చార్ ధామ్ యాత్ర మార్గంలో విరిగిన కొండచరియలు
ఉత్తరాఖండ్ లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో, చార్ ధామ్ యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల యాత్రికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అటు హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతుండటంతో కంగ్రా, మండి, చంబా ప్రాంతాల రహదార్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. ఇటు ఉత్తర కాశీలోనూ కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలతో గంగ, యుమున నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి.