: గవర్నర్ కు ఉమ్మడి అధికారాల వెనుక రాజకీయ ఉద్దేశం: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నర్ కు విశేష అధికారాలుంటాయంటూ కేంద్రం తాజాగా లేఖ రాయడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందన్నారు. ఈ విషయంలో కేంద్రం తన పరిధి దాటి పనిచేస్తోందని, హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమని చెప్పారు. రాజకీయ పునాదులు కదులుతున్న వారు చేస్తున్న రాద్ధాంతం ఇదని ఆరోపించారు.