: పాత చట్టాల బూజు దులిపేందుకు మోడీ సర్కారు సన్నాహాలు


ఆ చట్టాల్లో మెజార్టీ వాటా, అప్పటికే అమలులో ఉన్న చట్టాలకు చేసిన సవరణ చట్టాలదే. వాటి వల్ల ప్రభుత్వ పాలనలో ఎప్పటికప్పుడు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. అంతేనా, అధికార యంత్రాంగాన్ని అయోమయంలో పడేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో వారి చేతులనూ కట్టేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పలు సందర్భాల్లో ఇలా పాలనకు అడ్డుగా నిలుస్తున్నాయంటూ వందల కొలది చట్టాలను ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో అధికారం చెలాయించిన ఎన్డీఏ సర్కారు, అసలు ఇలాంటి చట్టాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో రద్దు చేసేందుకు అవకాశమున్న వాటి సంఖ్య ఎంత? అనే విషయాన్ని తేల్చేందుకు పీసీ జైన్ నేతృత్వంలో ఓ కమిటీనే వేసింది. సుదీర్ఘ పరిశీలన అనంతరం, ఈ తరహా చట్టాలు 2,500 దాకా ఉన్నాయని, వాటిలో 1,300 వరకు రద్దు చేయొచ్చని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈలోగా ఎన్డీఏ సర్కారు గద్దె దిగడంతో చట్టాల రద్దు అంశంపై మూలనపడింది. తాజాగా అధికారం చేపట్టిన ఎన్డీఏ సర్కారు మళ్లీ దీనిపై దృష్టి సారించింది. ప్రధానిగా పదవి చేపట్టిన తర్వాత అధికారులతో జరిపిన తొలి భేటీలోనే ఈ అంశాన్ని ప్రస్తావించిన మోడీ, ఆ దిశగా చర్యలు వేగంగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే 36 పాత చట్టాల రద్దుకు రంగం సిద్ధమైంది. వీటిలో 34 చట్టాలు, అంతకుముందున్న చట్టాలకు చేసిన సవరణ చట్టాలే. నాలుగు మాత్రమే నేరుగా రూపొందించిన చట్టాలు. మరో 250 పాత చట్టాలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రద్దు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News