: దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సోనియా, రాహుల్
ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మెదక్ జిల్లాలో జరిగిన స్కూలు బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారులు మృతి చెందడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలిపారు. ప్రమాదాలు చోటుచేసుకోకుండా రైల్వే శాఖ తక్షణం చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.