: హైదరాబాదు మార్కెట్లోకి ‘ఆడి ఏ3’ సెడాన్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి మరో కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఆడి ఏ3’ పేరుతో ఈ కారును వినియోగదారుల ముందుకు తెచ్చింది. ఈ సరికొత్త కారును ‘ఆడి’ హైదరాబాదు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సంగ్వీ మార్కెట్లోకి విడుదల చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఆడి కార్ల షోరూమ్ లో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ ‘ఆడి ఏ3’ కారు ప్రారంభ ధర హైదరాబాద్ షోరూమ్ లో రూ.23,59,000 ఉంటుందని రాజీవ్ సంగ్వీ తెలిపారు.