: అక్కడ... చిలుకలే కాదు ఎలుకలూ జాతకం చెబుతాయి!
చిలక జోస్యం గురించి మనకు తెలుసు. అయితే, ఇప్పుడు ఎలుక జోస్యం కొత్తగా వెలుగులోకి వచ్చింది. చెన్నై సమీపంలోని నాగపట్నం జిల్లా శీర్కాళిలో వినోద్ అనే వ్యక్తి పెంచుతున్న ఎలుకలు జాతకాలు చెబుతాయట. ఆస్ట్రేలియాలో ఎలుకలతో జాతకాలు చెప్పించుకోవడం సాధారణమేనట. ఓసారి ఆస్ట్రేలియా వెళ్లిన వినోద్ కుందేళ్లను తలపించేలా ఉన్న రెండు ఎలుకల్ని కొనుక్కొచ్చాడు. అవి తమ సంతానాన్ని బాగా వృద్ధిచేశాయి. ఇవి కుందేళ్లలా వివిధ రంగుల్లో ఉండడంతో పాటు జాతకాలు కూడా చెబుతాయని ప్రచారం కావడంతో వీటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తుంటారు. వీరిలో కొంత మంది ఈ మూషికాలను చూసి ముచ్చటపడి కొనుక్కుని వెళ్లారట. మీక్కూడా కొనుక్కోవాలనుంటే వెంటనే ఓ ఆరొందల రూపాయలు పట్టుకుని వెళ్తేచాలు... జంట ఎలుకలు మీవే.