: పశ్చిమగోదావరి నుంచి ఆ మండలాలను విడదీయవద్దు
పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కొయ్యలగూడెం మండలాలను విడదీయవద్దంటూ ప్రజాసంఘాలు ఆందోళన బాట పడ్డాయి. ఈ మూడు మండలాల్లో ప్రజాసంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కొయ్యలగూడెం ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ మూడు ప్రాంతాల్లో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది.