: నేను రాజకీయాల్లోకి రావడం లేదు: ప్రియాంకాగాంధీ
ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత తరుణంలో ప్రియాంకాగాంధీ రాజకీయ రంగప్రవేశం చేస్తేకానీ కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టలేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో అమిత్ షాకు చెక్ పెట్టాలంటే, ప్రియాంకాగాంధీ రాజకీయాల్లోకి రావాలంటూ బ్యానర్లు కట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ప్రియాంకాగాంధీ నోరు విప్పారు. తాను రాజకీయ రంగప్రవేశం చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తాను పగ్గాలు చేపడుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ నిరాధారమేనని, అవాస్తవాలని ప్రియాంకాగాంధీ తెలిపారు.