: ప్రసారాలను పునరుద్ధరించండి... లేకపోతే లైసెన్సులు రద్దు చేస్తాం: కేంద్ర మంత్రి జవదేకర్
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎంఎస్ఓలతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టీవీ ఛానళ్ల ప్రసారాల నిలిపివేత విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. టీవీ9, ఏబీఎస్ ప్రసారాలను పునరుద్ధరించాలని ఆయన ఎంఎస్ఓలను ఆదేశించారు. వారికి సోమవారం వరకు జవదేకర్ గడువునిచ్చారు. ప్రసారాలను పునరుద్ధరించకపోతే లైసెన్సులను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.