: అవసరమైనప్పుడు దర్శకత్వం చేస్తా: రచయిత చేతన్ భగత్
తన రచనలతో పలువురు అభిమానులను సంపాదించుకున్న రచయిత చేతన్ భగత్ ఇటీవలే సల్మాన్ ఖాన్ బాలీవుడ్ చిత్రం 'కిక్'తో స్క్రీన్ ప్లే రచయితగా కూడా మారాడు. ఆయన రచించిన పుస్తకాల ఆధారంగా బాలీవుడ్ లో సినిమాలు కూడా తీస్తున్నారు. అయితే, మీరెప్పుడు దర్శకత్వం చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా చేతన్ స్పందిస్తూ, "ఇప్పుడప్పుడే అటువైపు వెళ్లను. ప్రస్తుతం నా రచన ద్వారా తగినంత కిక్ పొందుతున్నాను. ఎప్పుడయితే కొత్త కిక్ కావాలనుకుంటానో అప్పుడు తప్పకుండా ఆ ఆప్షన్ ను పరిశీలిస్తాను" అని చెప్పాడు.