: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే వరకు నిరంతరం కృషి చేస్తా: చంద్రబాబు


రాష్ట్రంలో మొత్తం లక్షా 31 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, కోళ్లు, చేపల పెంపకంలో అధిక ఆదాయం వస్తోందని ఆయన చెప్పారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా చోడవరంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటానని అన్నారు. రైతు రుణమాఫీ ఆరంభం మాత్రమేనని... అంతం కాదని అన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. రైతు సంక్షేమం కోసం మరిన్ని పథకాలను తీసుకువస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా చోడవరం చక్కెర ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తానని చెప్పారు. హైదరాబాదు లాంటి ఐదారు నగరాల్ని ఏపీలో అభివృద్ధి చేస్తానన్నారు. ఖరీఫ్ పూర్తయ్యేలోగా వారానికో జిల్లాలో పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే వరకు నిరంతరం కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. తక్కువ ఉత్పాదక శక్తి, తక్కువ దిగుబడి వల్ల ఆదాయం రావడం లేదని... రైతులు ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు కోరారు.

  • Loading...

More Telugu News