: గూగుల్ తో చేయి కలపనున్న యాహూ


మరింత సురక్షితమైన ఈమెయిల్ వ్యవస్థ కోసం యాహూ... మరో దిగ్గజం గూగుల్ తో జత కలిసేందుకు సిద్ధమైంది. సంయుక్తంగా రూపొందించే ఈమెయిల్ సర్వీసు... హ్యాకర్లుగానీ, అటు ప్రభుత్వాలు గానీ ఛేదించలేనంత దుర్భేద్యంగా ఉంటుందని యాహూ పేర్కొంది. వేలాది ప్రైవేటు మెయిళ్ళను అమెరికా నిఘా సంస్థలు అనుమతి లేకుండా పరిశీలించాయని ప్రజావేగు ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రపంచానికి వెల్లడించిన నేపథ్యంలో ఈమెయిల్ సర్వీసులకు అత్యంత భద్రత కల్పించేందుకు యాహూ, గూగుల్ నడుం బిగించాయి. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News