: స్కూల్ బస్సు ప్రమాదంపై బాధ్యత రైల్వే శాఖదే: ఎల్.రమణ
మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు. ఈ ఘోర ప్రమాదానికి బాధ్యత రైల్వేశాఖదేనని ఆయన అన్నారు. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద కాపలాదారుడిని ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా రైల్వే శాఖ... రైల్వే గేటు వద్ద గార్డులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, పెద్దిరెడ్డితో కలసి రమణ ఘటనాస్థలిని పరిశీలించారు.